జనగామ: సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కడియం శ్రీహరి

పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఉప ఎన్నికలు నిర్ణయించేది బీఆర్ఎస్ పార్టీనో, కేటీఆర్ కాదని కడియం విమర్శించారు. మూడు నెలల్లోపు స్పీకర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్