పల్లగుట్టలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభం

ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి, స్టేషన్ గన్ పూర్ లోని పల్లగుట్ట ZPHS పాఠశాల మైదానంలో బుధవారం మండల స్థాయి ZPHS, SGF మండల్ స్కూల్ గేమ్స్–2026 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు వాలీబాల్ కొట్టి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం విజయ్ కుమార్, సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, యూత్ అధ్యక్షుడు ఇసురం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్