మోడీ నాయకత్వమే ప్రజలకు శ్రీరామరక్ష

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని బీజేపీ నేత రమేష్ అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నిర్వహించిన 'మన్ కి బాత్' కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలిసి రమేష్ ఆదివారం ఆసక్తిగా తిలకించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్