జనగాం: ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ నర్సరీ పరిశీలన

జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించారు. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ నర్సరీని అధికారులతో కలిసి పరిశీలించారు. నర్సరీలో ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం, సస్య రక్షణ చర్యలు, రైతులకు అందుతున్న విధానంపై ఆయన సమీక్షించారు. మొక్కల పెంపకంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని ఆయన అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్