చిల్పూర్ మండలంలోని PACS, IKP వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరిగిన లక్షల రూపాయల అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వెంకటాద్రిపేట, వెంకటేశ్వర్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది రైతులు గత రెండు రోజులుగా ఎమ్మార్వోకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడంతో ఈ ధర్నా చేపట్టారు.