జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలోని పురాతన త్రికూట ఆలయాన్ని ఆదివారం జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే త్రికుటాలయం శిథిలావస్థకు చేరుకుందని, గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనా నామమాత్రపు పనులు చేసి వదిలేసిందని ఆరోపించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన త్రికూట ఆలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి పునర్ నిర్మించాలని డిమాండ్ చేశారు.