ఎండల వేడికి ఉపశమనం: 4,500 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ

ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలోని కొమ్మాల అంగడి ప్రాంగణంలో అల్లం బాల కిషోర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'శీతల మజ్జిగ పంపిణీ' కార్యక్రమం జరిగింది. నాయకులు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 4,500 మందికి పైగా రైతులు, పశువుల వ్యాపారులు, ప్రయాణికులకు ఉచితంగా చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్