జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలంతో సిబ్బంది, రోగులు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం ప్రభుత్వాసుపత్రిలో అన్నం తింటున్న రోగులు పాము చూసి ఆందోళనకి గురై సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆస్పత్రి సిబ్బందితో కలిసి సుమారు 30 నిమిషాలు పాటు శ్రమించి ఎట్టకేలకు రమణ అనే వ్యక్తి పామును పట్టుకున్నాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.