స్టేషన్ ఘన్పూర్: ఇంకుడు గుంతలు పరిశీలించిన డీపీఓ

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను శనివారం జిల్లా పంచాయతీ అధికారి స్వరూప రాణి పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో రైతు వేదిక పీహెచ్సీ అంగన్వాడీ సెంటర్లలో తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్నారు. గుంతలను ఆమె సందర్శించారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద మురికి నీరు ఆగిన చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్