ఎమ్మార్పీఎస్ సంస్థ అనేక ఏళ్లుగా దళితుల హక్కుల కోసం పోరాడుతుందని ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా ఇన్చార్జి తోకల చిరంజీవి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండలో శనివారం ఎంఆర్పిఎస్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మారపాక సంపత్, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు.