చిలుపూర్ మండలం ఫత్తేపూర్ గ్రామ శివారులోని మల్లన్నగండి రిజర్వాయర్లో శ్రీనివాస్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న రిజర్వాయర్ గేట్ ఆపరేటర్ శ్రీను, వెంటనే ఎస్సై నవీన్ కుమార్ కు సమాచారం అందించాడు. ఎస్సై తన సిబ్బందితో రిజర్వాయర్ వద్దకు చేరుకుని, ఆపరేటర్ శ్రీను సహకారంతో తెప్ప సహాయంతో శ్రీనివాస్ ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.