ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య

జఫర్ ఘడ్ శివారు నల్లబండ వద్ద వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన ఉల్లెంగుల యాదగిరి (65) తాగుడుకు బానిసై, భార్యతో తరచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉండలేక జీవితంపై విరక్తి చెందిన యాదగిరి నల్లబండ సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్