మడికొండ చౌరస్తాలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షుడు గంగారపు యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పండ్లు పంపిణీ చేశారు. రజాకార్లు, భూస్వాముల వ్యతిరేక పోరాటంలో ఐలమ్మ స్ఫూర్తిని రజక కులస్తులు ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచందర్, గిరి కుమారస్వామి, శ్రీధర్, చిన్న కుమారస్వామి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.