గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం అర్ధరాత్రి కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్యనున్న దర్గా కాజీపేట రైల్వేగేటు సమీపంలో రైలు నెం. 12762 కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.