వరంగల్ రామన్నపేట హంటర్రోడ్డు సెంటర్లో ఉత్తమ్ కుమార్ అనే యువకుడు స్నేహితులతో మాట్లాడుతుండగా, మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఉత్తమ్ కుమార్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన యువకులు నాలుగు రోజులుగా ఆయుధాలతో సంచరిస్తున్నారని స్థానికులు తెలిపారు. మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.