నషా ముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా వరంగల్ లోని మైనారిటీ పాఠశాల ములుగు రోడ్డు యందు వైద్యాధికారి డాక్టర్ బి దుర్గాప్రసాద్ పిల్లలందరికీ మత్తు పదార్థాలు వాటి వల్ల కలిగే అనర్ధాలు ఆరోగ్య పరిస్థితులు అన్నింటిపై సమగ్ర అవగాహన కల్పించారు. పిల్లలందరి చేత మత్తు పదార్థాలు ఏ రూపకంగానూ తీసుకోకుండా ఉండేటట్టు ప్రతిజ్ఞ చేయించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల వైద్యాధికారి డాక్టర్ టి. కవిత, ప్రిన్సిపాల్ మురళి, రాజేష్, ఫార్మసీ ఆఫీసర్ దినేష్, ఏఎన్ఎం శారద పాల్గొన్నారు.