వరంగల్ రామన్నపేటలో మద్యం మత్తులో కత్తులు, బీరు సీసాలతో దాడి చేసిన ఘటనలో మట్టెవాడ పోలీసులు ఆరుగురు యువకులపై కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి జరిగిన ఈ దాడిపై బాధితుడు ఉత్తమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామన్నపేట ప్రాంతానికి చెందిన చందు, ఫాల్సన్, సిద్దు, శివసాయి, అబ్బు, వినయ్ లపై కేసు నమోదు చేసినట్లు మట్టేవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.