వరంగల్ నగరంలో సోమవారం చైన్స్ స్నాచింగ్ జరిగిందని మట్టెవాడ సీఐ గోపి తెలిపారు. భద్రకాళి ఆలయ రోడ్డులో స్వప్న పూల వ్యాపారం నిర్వహిస్తోంది. సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి రోల్డో గోల్డ్ చైన్ ను అపహరించారు. హనుమకొండ కాపువాడ రోడ్డు నుంచి భద్రకాళి గుడి రోడ్డు వైపు చైన్ స్నాచర్లు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.