వరంగల్‌లో చైన్ స్నాచింగ్

వరంగల్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ప్రమీల అనే గర్భిణి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. అలాగే జనగామలోని వీవర్స్ కాలనీకి చెందిన వీరస్వామి - లక్ష్మీ దంపతులను కత్తులతో బెదిరించి మూడు తులాల బంగారు చైన్‌ అపహరించుకుపోయారు. వరుస చైన్ స్నాచింగ్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్