కెసిఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు.