చిట్ ఫండ్ పేరుతో మోసగించిన ఇద్దరిపై శుక్రవారం మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లయ్య తెలిపారు. ఓ చిట్ఫండ్లో పనిచేస్తున్నామని నమ్మించిన కిరణ్ కుమార్, రవికుమార్ లకు పెరుకవాడకు చెందిన అజయ్ కుమార్ రూ. 1, 65, 700 నగదు ఇచ్చారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని అడగ్గా మొఖం చాటేశారు. సంబందిత కార్యాలయానికి వెళ్లి అడగ్గా. వారిద్దరూ తమ వద్ద పనిచేయరని చెప్పడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు