వరంగల్ రైల్వే స్టేషన్‌లో గత 15 రోజులుగా రాపిడో పాయింట్ వద్ద ఒక గ్లామర్ బండి పార్క్ చేసి ఉంది. నంబర్ ప్లేట్ లేని ఈ బండి యజమాని 10 రోజులు గడిచినా కనిపించకపోవడంతో, రాపిడో యువకులు ఇది దొంగ బండి అయి ఉంటుందని గుసగుసలాడుకుంటున్నారు. పోలీసులకు సమాచారం అందించినా, తమ పరిధిలోకి రాదని స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని, ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.