హన్మకొండ నగరంలోని భవానీ నగర్ కాలనీలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో అనేక వైద్య విభాగాల నిపుణులు పాల్గొని ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ, భవానీ నగర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడును అని జనరల్ సెక్రటరీ డా. అజిత్ మహామ్మద్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు.