ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్‌షీట్ల ఆర్డర్లను టెస్కో సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం ముగిసింది. మంత్రి కొండా సురేఖ ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులతో శుక్రవారం చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి ఆమె సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో చేనేత సంఘాల నాయకులు, కార్మికులు తమ దీక్షను విరమించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 30% అధిక ధరలు వెచ్చించి కార్పెట్లు కొంటామని, వారం రోజుల్లో సీఎం మిగతా విషయాల పట్ల చర్చ జరుపుతామని తెలిపారు.