రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా, బుధవారం ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ లోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన 10 మంది విద్యార్థులను బహిష్కరించినట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ తెలిపారు. ఈ ఘటనతో పరీక్షల నిర్వహణపై ఆందోళన నెలకొంది.