వరంగల్: భార్యను చంపేందుకు భర్త క్షుద్రపూజలు

వరంగల్ జిల్లా వడ్లకొండ గ్రామంలో భార్యను అడ్డుతొలగించుకునేందుకు భర్త రాజు క్షుద్రపూజలు చేస్తున్న ఘటన కలకలం రేపింది. గ్రామశివారులోని మర్రిచెట్టు కింద భార్య మద్దేబోయిన కవిత ఫోటోతో పూజలు నిర్వహించినట్లు తెలిసింది. తన భర్త తనను చంపేందుకు క్షుద్రపూజలు చేస్తున్నాడని భార్య కవిత ఆరోపిస్తూ, పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో భర్త రాజుపై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్