హనుమకొండ జిల్లాలో వర్షం మొదలైంది. నగరంలోని కాజీపేట, సుబేదారి, చౌరస్తా, గోపాల్పూర్, తిరుమల జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్‌లో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్నిచ్చింది. చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.