హన్మకొండలో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం, జనజీవనం స్తంభించింది

హన్మకొండలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా 57వ డివిజన్‌లోని అమరావతి నగర్, 100 ఫీట్ రోడ్డు, టివి టవర్ కాలనీ, వాజ్పేయి కాలనీ, కూడా కాలనీ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపించాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు, వర్షపు నీటితో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హనుమకొండ-వరంగల్ ప్రధాన రహదారి వద్ద కూడా వరదనీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంతల్లో నీరు నిలిచి పలువురు వాహనదారులు అదుపుతప్పి పడిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్