వరంగల్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి. ప్రయాణికులను దింపడానికి లేదా ఎక్కించుకోవడానికి వచ్చే వాహనాల వద్ద, పార్కింగ్ లేని స్థలంలో నిలిచిన వాహనాల వద్ద కూడా డబ్బు వసూలు చేస్తున్నారు. కారుకు 50 రూపాయలు, టూవీలర్‌కు 20 రూపాయలు చొప్పున వసూలు చేస్తూ వాహనదారులను దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిలదీసిన వారిపై దురుసుగా సమాధానం ఇస్తున్నారని సమాచారం.