వరంగల్ సీకేఎం ప్రభుత్వ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డుపై రోగి బంధువు కత్తితో దాడి చేసిన ఘటన శనివారం వెలుగులో వచ్చింది. రంగశాయిపేటకు చెందిన సయ్యద్ షబ్బీర్ ప్రసూతి అయిన బంధవును చూసేందుకు అర్ధరాత్రి రాగా సెక్యూరిటీ గార్డు అనుమతించ లేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం కాగా, ఆవేశానికి లోనైన షబ్బీర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గార్డు పై దాడికి యత్నించాడు. గార్డు తప్పించుకొని అరవడంతో షబ్బీర్ ను బంధించారు.