కారును ఢీకొన్న లారీ.. మల్లంపల్లిలో ట్రాఫిక్ జామ్

మల్లంపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులో ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై చాలాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. మేడారం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్