శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తనపై గురువారం మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికార పార్టీ నుంచి తాము సమాధానం చెప్తుంటే రన్నింగ్ కామెంట్రీ చేయడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలు, పద్ధతులు, నియమాలను పాటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు సురేఖ హితవు పలికారు. రేషన్ కార్డుల మీద బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నించే అర్హత ఉందా అని ఆమె అడిగారు.