వరంగల్‌లో గ్యాస్, సీఎన్‌జీ ధరల పెంపుపై నిరసన

వరంగల్ నగరంలో పెరిగిన వంట గ్యాస్, సీఎన్‌జీ ధరలను తగ్గించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కార్మికులు, మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని, మధ్యతరగతి, బడుగు వర్గాల జీవనం కష్టమవుతోందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎన్‌జీ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, రవాణా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్