ప్రజావాణి లో స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పాలన సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం దరఖాస్తులు (103) రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.