వరంగల్ రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని నాంపెల్లి నవ్యశ్రీ, ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్ణాటకలోని బెంగళూరులో 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు జరిగే జూనియర్ నేషనల్ ఖో-ఖో పోటీలలో పాల్గొనడానికి ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ గోగు నారాయణ తెలిపారు.