దుకాణాలు మూసివేసి నిరసన

రాష్ట్ర పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్, సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుల వెంకటేశ్వర్లు, ఎరువుల సరఫరాలో ఎఫ్ పి ఎల్ విధానాన్ని అమలు చేయాలని, లింక్ ప్రొడక్ట్ లేకుండా డీలర్లకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుకాణాలు మూసివేసి, నిరసన మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉత్పత్తిదారుల విధానాలు వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, యూరియా సరఫరాలో కంపెనీలు మార్క్ఫెడ్ కు లింకులు లేకుండా సరఫరా చేసి, వ్యాపారులకు మాత్రం లింకులు పెట్టి అమ్ముతున్నారని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్