వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్‌లో మాట్లాడుతూ తెలంగాణలో గ్రేటర్ వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ సిటీ పనులు ఇంకా పూర్తికాలేదని, ప్రజల మౌలిక అవసరాల దృష్ట్యా మిషన్ గడువును జూన్ 2026 వరకు పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్రం ఇప్పటికే మిషన్ మార్చి 2025తో ముగిసిందని, మిగిలిన పనులు SPVల ద్వారా పూర్తి చేయాలని తెలిపింది.