వరంగల్ నగరంలోని రేషన్ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రామన్నపేటలోని ఒక రేషన్ దుకాణంలో 54 క్వింటాళ్ల బియ్యం నిల్వలను యజమాని అక్రమంగా తరలించినట్లు కేసు నమోదు చేసి, దుకాణాన్ని సీజ్ చేశారు. తూకం విషయంలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.