వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ సోమిడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ పేర్కొన్నారు. దేశంలో కొత్త వంగడాలను తయారు చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తేనే నిరుద్యోగం నిర్మూలన అవుతుందని వారు తెలిపారు.