ఖిలా వరంగల్ లో ట్రంప్ నేత న్యాహు దిష్టిబొమ్మ దగ్ధం

ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ దేశాల దాడులను నిరసిస్తూ ఖిలా వరంగల్ పడమరకోట చమన్ సెంటర్లో ఆ దేశాధినేతల దిష్టిబొమ్మను సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు. అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, అధికార ప్రతినిధి గంగుల దయాకర్, నాయకులు బండి కోటేశ్వరరావు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్