అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం అని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్ విభాగం ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్ని మాపక వారోత్సవాల నేపధ్యంలో వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ (గోడ పత్రిక) పాంప్లెంట్ (కరపత్రం) ను సోమవారం ఆవిష్కరించారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేయాలన్నారు.