వరంగల్ భద్రకాళి ఆలయంలో గురువారం నిర్వహించే శాకాంబరీ వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయం ఆవరణలోని అమ్మవారి సన్నిధిలో శాకాంబరీ అలంకరణకు సంబంధించి మహిళలు, పలువురు సేవకులు కూరగాయలు, పండ్ల మాలలు అల్లుతున్నారు. ఆలయం మొత్తం సందడి నెలకొంది. అమ్మవారికి సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు మహిళలు తెలిపారు.