తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కురుమల కుల దైవం బీరన్న బోనాల వేడుక ఆదివారం కనులపండువగా జరిగాయి. కరీమాబాద్, ఉర్సులోని కురుమ కుల మహిళలు భక్తితో బొనమెత్తారు. బీరప్ప సంప్రదాయంగా గావు పట్టగా బోనాలు బీరన్న గుడికి చేరుకున్నాయి. స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తిరుగుముఖం పట్టారు. మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.