వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్-1 పై ఒంటరిగా తిరుగుతున్న 13 ఏళ్ల బాలుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. విచారణలో అతను మహబూబాబాద్ సిద్ధుల తండాకు చెందిన వాంకుడోత్ మహేష్ అని, తల్లికి చెప్పకుండా వచ్చినట్లు తేలింది. GRP CI సురేందర్ ఆదేశాల మేరకు, బాలుడి భద్రత కోసం వరంగల్ చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సిలర్ (CHC) జి. కిరణ్‌కు అతన్ని సురక్షితంగా అప్పగించారు.