వరంగల్: ఎనుమాముల మార్కెట్లో పత్తికి రికార్డు

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తికి గతంలో ఎప్పుడూ లేని రికార్డు ధర నమోదైంది. గత 6 నెలల కాలంలో చూడని విధంగా, పత్తికి క్వింటాల్కు రూ. 7, 700 ధర పలికింది. సోమవారం ఈ ధర రూ. 7, 505గా ఉండగా, ఒక్క రోజులోనే రూ. 195 పెరగడం రైతులను ఆనందానికి గురి చేసింది. పత్తికి అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా మార్కెట్ ధరల్లో ఈ విధమైన హెచ్చుతగ్గులు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్