వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా సంధ్యారాణి

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా గురువారం నూతనంగా పదవి బాధ్యతలు డా- సుంకరనేని సంధ్య రాణి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే కళాశాలలో చదువుకొని ఉద్యోగం రాగానే ఇదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి వివిధ కళాశాలలకు బదిలీలు అయి తిరిగి ఈ కళాశాలకు ప్రిన్సిపల్ గా రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కళాశాలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్