వరంగల్ జిల్లాలో యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా సరఫరాపై అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. రైతులకు అవసరమైన పరిమాణంలో యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా డిమాండ్ సప్లై వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు.