బాలల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాజీపేట రైల్వే స్టేషన్‌లో షేర్ ఎన్జీవో ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హనమకొండ జిల్లా కోఆర్డినేటర్ తోట శిరీష మాట్లాడుతూ బాలల అక్రమ రవాణా సామాజిక సమస్యగా మారిందని, దీన్ని అరికట్టేందుకు అందరూ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.