ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని యువకుడు బావిలో పడి మృతి చెందిన ఘటన జరిగింది. బొల్లికుంటకు చెందిన ఎర్ర వంశీ హైదరాబాద్లో ప్రైవేటు జాబ్ చేస్తుండేవాడు. శుక్రవారం బొల్లికుంటకు వచ్చిన వంశీ అదేరోజు బొల్లికుంట చెరువు వద్ద గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఈతకు వెళ్లిన వారికి బావిలో వంశీ మృతదేహం కనిపించడంతో విషయాన్ని గ్రామస్థులకు, పోలీసులకు తెలిపారు.