వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి, నల్లా పన్ను చెల్లింపునకు మంగళవారం వరకు తుది గడువు ఉందని కలెక్టర్, GWMC ఇన్‌ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్ల ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పెనాల్టీల నుంచి ఉపశమనం పొందాలని సూచించారు. అర్ధరాత్రి వరకు మీసేవ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.